తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ - new year celebrations

New Year 2024 Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి అంబురాన్నంటే సంబురాలతో స్వాగతం పలకడానికి ప్రజలు సిద్ధమయ్యారు. డిస్కో లైట్లు, డీజే సప్పుళ్లతో రాష్ట్రవ్యాప్తంగా కోలాహలం నెలకొంది.

CM Revanth on newyear 2024
New Year 2024 Celebrations in Telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 11:02 PM IST

Updated : Jan 1, 2024, 7:00 AM IST

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ

New Year 2024 Celebrations in Telangana :నూతనసంవత్సర(New year) వేడుకలు రాష్ట్రంలో అట్టహాసంగా జరిగాయి. 2023కి వీడ్కోలు పలుకుతూ 2024ని సాదరంగా స్వాగతం పలికారు. కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. కేక్ కటింగ్‌లు, డీజే మోతలు, ధూంధాం నృత్యాలు, తీన్‌మార్ స్టెప్పులతో పట్నం నుంచి పల్లె వరకూ ఆటపాటలతో హోరెత్తింది. ఎటుచూసినా నయా జోష్‌తో సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని మంత్రులు ఆకాంక్షించారు.

Telangana Ministers New Year Wishes 2024: రాబోయే 2024 భారతదేశానికి కీలకమైన సంవత్సరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan Reddy) అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాని మోదీ మూడోసారి ముచ్చటగా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని అంతా టీవీల్లో తిలకించాలని కోరారు.

హ్యాపీ న్యూ ఇయర్ తెలంగాణ - గవర్నర్, సీఎం శుభాకాంక్షలు

కొత్త ఏడాదిలో ప్రతిపేదకుటుంబానికి సొంతింటి కలనెరవేరాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Srinivas Reddy) ఆకాంక్షించారు. ఆరు గ్యారంటీలను అర్హులందరికీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Seethakka) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలు, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.

న్యూ ఇయర్ 2024- మన స్టార్ల ప్లాన్స్​ ఏంటంటే?

Hyderabad CP New Year wishes 2024: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై హైదరాబాద్‌ సీపీ శ్రీనివాసరెడ్డి కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సరం సుఖశాంతులు కలిగించాలని ఆకాంక్షించారు. ప్రజలంతా పోలీస్‌ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మీడియా, పోలీస్‌ ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంతకుముదు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రజలు ప్రభుత్వానికి వారధిగా మీడియా పనిచేస్తుందని కొనియాడారు.

New Year 2024 Celebrations :రాష్ట్రవ్యాప్తంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. హ్యాపీ న్యూఇయర్అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్న యువత నృత్యాలతో సంతోషాలను రెట్టింపుచేశారు. పబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్ట్‌ల వద్ద వేడుకలు హోరెత్తాయి. హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీల్లోని పలుచోట్ల ప్రజలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. ఆడిపాడి సందడి చేశారు.

New Year 2024 Celebrations In Hyderabad :పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకున్నారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చుతూ కేక్‌లు కట్‌చేశారు. హైదరాబాద్‌లోని బాహ్యవలయ రహదారిసహా దాదాపుగా అన్ని పైవంతెనలనిపోలీసులు మూసివేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ సహా జిల్లాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టిన పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లు, బార్లలో మాదకద్రవ్యాలు,మత్తు పదార్ధాలసరఫరా కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

న్యూ ఇయర్​ వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి పొన్నం ప్రభాకర్​

'న్యూ ఇయర్​ ఎంజాయ్​ చేయండి - పరిమితులు దాటొద్దు'

Last Updated : Jan 1, 2024, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details