తెలంగాణ

telangana

ETV Bharat / state

New Year 2024 Live Update : న్యూఇయర్​ వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు - new year in Telangana

New Year 2024 Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్​ ఘనంగా జరుగుతున్నాయి. పోలీసులు నగరాల్లో పలు ఆంక్షలు పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించకుండా వేడుకలు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వేడుకల్లో బిజీగా ఉన్నారు.

New Year Celebrations in Hyderabad
New Year 2024 Celebrations

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 8:18 PM IST

Updated : Dec 31, 2023, 10:18 PM IST

10:16 PM

నూతన సంవత్సర వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు

హైదరాబాద్​లోని బేగంపేటలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరైయ్యారు.

09:53 PM

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి దనసరి అనసూయ సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన అధ్యాయంగా ఉండాలని కోరారు.

09:19 PM

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాసరెడ్డి

తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఏడాదిలో ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు

09:13 PM

డ్యాన్స్​ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్​లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మంత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేశారు.

08:10 PM

ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ తమిళి సై అన్నారు. ప్రజలకు న్యూ ఇయర్​ విష్​ చేశారు. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను 'రైతు-మహిళ- యువత' నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్​ ఇతర ప్రముఖులు ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Dec 31, 2023, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details