New Year 2024 Celebrations In Hyderabad : కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. నూతన ఏడాదికి ఘనస్వాగతం పలికేందుకు యువత ఉత్సాహంగా సిద్ధమైంది. న్యూ ఇయర్‌దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఫైఓవర్లు, పలు రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Traffic Restrictions in Hyderabad : నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రాత్రి 10 గంటల తర్వాత వాహనాలను అనుమతించరు. యువత ఎక్కువగా ట్యాంక్ బండ్ వద్ద వేడుకలు చేసుకోవడానికి వస్తారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోనూ వాహనాలు దారి మళ్లించనున్నారు. డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ నడిపే వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టడానికి విస్తృత తనిఖీలు చేయనున్నారు.
న్యూ ఇయర్ స్పెషల్ గ్రీటింగ్స్ - ఇలా శుభాకాంక్షలు చెప్తే గుండెను తాకాల్సిందే!
New Year 2024 Police Guidelines in Hyderabad: భాగ్య నగరంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే ప్రత్యేకడ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు. 31 ట్రాఫిక్ పోలీసు ఠాణాల పరిధిలో విస్తృతంగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది తొలిసారి డ్రంకన్ డ్రైవ్ తరహాలో నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అనుమానితుల మూత్ర నమూనా తీసుకొని, ఐదు నిమిషాల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నది లేనిది అక్కడే నిర్ధారిస్తారు.
Police Full Focus on Hyderabad Pubs : పబ్‌లు, క్లబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటళ్ల నిర్వాహకులకు పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. మద్యం తాగిన వారిని సురక్షితంగా ఇల్లు చేర్చేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకల్లో డ్రగ్స్ వాడినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని హైదరాబాద్ సీపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి యువతకు సూచించారు. శాంతి భద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.