ఒక బహుమతి... ఇచ్చిన వారి ప్రేమను తెలియజేస్తుంది. దానిని చూసిన ప్రతిక్షణం మనకు వారిపై ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుంది. మరి అలాంటి బహుమతులను ఈ కొత్త సంవత్సరం నాడు ఇచ్చి... ఇచ్చి ప్రేమను తెలుపుదాం.
డైరీ...
కొత్త ఏడాది అనగానే డైరీ గుర్తుకువస్తోంది. మీ స్నేహితులకు గానీ, మీ సన్నిహితులకు ఈ గిఫ్ట్ ఇస్తే ఎంతో బాగుంటుంది. ఒకప్పుడు డైరీకి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు అఫీసుల్లో ఉద్యోగులకి ప్రతి సంవత్సరం చివర బహుమతులుగా ఇచ్చుకోవడానికే పరిమితమైంది. తమ భావాలను, అనుభూతులను, ప్రేమను, బాధను, సంతోషాన్ని, విచారాన్ని, విషాదాన్నీ... ఒకటేమిటీ, అన్నీ తనతో పంచుకోవచ్చు. ఇందరికీ ఓదార్పు అవుతోన్న డైరీ గొప్పదనం, అవసరం తెలీడంలేదు. అందుకే మీ సన్నిహితులకు డైరీని ఇచ్చి... మెప్పు పొందండి.
వాచ్....
స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగాక వాచ్‌ల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. కొంత మంది ఫ్యాషన్ కోసం ధరిస్తుంటారు కానీ... అసలు అప్పట్లో గడియారం చేతికి ఉంటే ప్రతిక్షణాన్ని మనకు గుర్తుచేసేది. ఇప్పుడు మీ సన్నిహితులకు నూతన సంవత్సరం సందర్భంగా ఒక వాచ్‌ను బహుమతిగా ఇవ్వండి. వారికి మీపై ప్రేమను ప్రతి క్షణం గుర్తుకు తెస్తుంది.
మొక్క...