తెలంగాణ

telangana

ETV Bharat / state

'రోజు విడిచి రోజు విధులకు డీజీపీ కార్యాలయ సిబ్బంది' - కరోనా తెలంగాణ డీజీపీ కార్యాలయం

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోజు విడిచి రోజు కార్యాలయాలకు రావాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

DGP
డీజీపీ

By

Published : Mar 20, 2020, 1:21 AM IST

Updated : Mar 20, 2020, 1:31 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... కరోనా వైరస్​ను నియంత్రించడానికి సామాజిక దూరం పాటించాలని సూచిస్తుండటం వల్ల... డీజీపీ కార్యాలయ ఉద్యోగులకు విధులను విభజించారు. గదుల్లో సిబ్బంది అంతా పక్కపక్కనే కూర్చోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవచ్చనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కార్యాలయ సిబ్బంది రోజు విడిచి రోజు ఉద్యోగానికి రావాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

కార్యాలయ సిబ్బంది ఒక రోజు ఒకరు.. మరో రోజు ఇంకొకరు విధుల్లో ఉండేలా చూడాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. దీన్ని సెలవుల కింద పరిగణించరాదని డీజీపీ చెప్పారు. అవసరమైతే ఎప్పుడైనా కార్యాలయానికి వచ్చే విధంగా ఉద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు. చరవాణిలోనూ అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యాలయ రోజువారీ పనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యోగులను సర్దుబాటు చేయాలని అధికారులకు డీజీపీ సూచించారు.

ఇదీ చూడండి:కరోనా భయంతో పెళ్లిల్లకు బంధుమిత్రుల దూరం

Last Updated : Mar 20, 2020, 1:31 AM IST

ABOUT THE AUTHOR

...view details