తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం దుకాణాలు మరిన్ని పెడుతున్నారహో...! - NEW WINE SHOPS IN TELANGANA

రాష్ట్రంలో మద్యం ప్రియులకు త్వరలోనే శుభవార్త వినిపించబోతున్నారు అధికారులు. కొత్తగా ఏర్పడిన మండలాలల్లో కొత్త మద్యం దుకాణాలు తెరిపించేందుకు ప్రణాళికలు చేస్తున్నారట. అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి వస్తున్న ఆబ్కారీ విధానంలో ఈ అంశాన్ని చేర్చబోతున్నట్లు సమాచారం.

NEW WINE SHOPS IN TELANGANA

By

Published : Jul 25, 2019, 5:54 AM IST

Updated : Jul 25, 2019, 7:31 AM IST

మద్యం దుకాణాలు మరిన్ని పెడుతున్నారటహో...!

రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన ఆబ్కారీ విధానంలో అదనపు దుకాణాలకు సంబంధించిన అంశాన్ని చేర్చబోతున్నారు అధికారులు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైన దృష్ట్యా వాటికి తగ్గట్టుగానే దుకాణాల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ కనీసం ఒక మద్యం దకాణం ఉండేలా అధికారులు పరిశీలిస్తున్నారు.

త్వరలోనే అమల్లోకి దుకాణాలు...

పునర్​వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 125 మండలాలు ఏర్పడ్డాయి. వీటిలో దాదాపు సగం వరకు మండల కేంద్రాల్లో దుకాణాలు లేవు. ఆయా చోట్ల ఏర్పాటుకు అవకాశం ఇవ్వటంతో పాటు డిమాండును బట్టి మిగతా మండల కేంద్రాలకూ మరికొన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. అక్టోబర్​ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇది రెండేళ్లపాటు ఉంటుంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయటంలో అధికారులు నిమగ్నమయ్యారు. కసరత్తు త్వరలోనే కొలిక్కిరానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 వైన్​ దుకాణాలు, 670 బార్లున్నాయి.

ఇవీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?

Last Updated : Jul 25, 2019, 7:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details