తెలంగాణ

telangana

ETV Bharat / state

హారన్ వేశారో... ఆగి తీరాల్సిందే - new traffic rule

పర్సు ఖాళీ చేసే ట్రాఫిక్​ నిబంధనలు అమలులో ఉండగా... ఇప్పుడు ఏకంగా మీ సమయానికి ఎసరు పెట్టే నిబంధనలు త్వరలోనే మీ ముందు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏంటి అనుకుంటున్నారా? అయితే దీనికి మీ సమయం ఇప్పుడు వెచ్చించాల్సిందే..!

new traffic rule for hyderabad people
హారన్ వేశారో... ఆగి తీరాల్సిందే

By

Published : Jan 31, 2020, 4:36 PM IST

Updated : Jan 31, 2020, 8:19 PM IST

ట్రాఫిక్​ సిగ్నల్​ వద్ద పచ్చ లైటు వచ్చేందుకు సమయం ఆసన్నమైందటే చాలు హారన్​ల మోత మోగడం సర్వసాధారణం. ఇకనుంచి అలాగే మోగిస్తాం అంటే కుదరదు సుమ. హారన్​ మోత 85 డెసిబుల్స్​ దాటిందే అంతే సంగతి. మరికొంత సమయంలో ట్రాఫిక్​లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇదేంటి అనుకుంటున్నారా? అవును అక్షర సత్యం.

రోడ్లపై శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు తెలంగాణ సర్కారు సరికొత్త నిబంధన తీసుకురాబోతుంది. 'హాంక్ మోర్, వెయిట్ మోర్' అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు కేటీఆర్ మొగ్గు చూపారు. ట్రాఫిక్​లో వెయిట్ చేస్తూ హారన్ శబ్దం 85 డెసిబుల్స్​ దాటిన ప్రతీసారి సిగ్నల్ వద్ద సమయం అమాంతం పెరిగిపోతుంది. దీనిని హైదరాబాద్​లో అమలు చేయాల్సిన అవసరం ఉందంటూ కేటీఆర్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ముంబైలో అమలు చేస్తున్న విధానానికి సంబంధించిన వీడియోను పరిశీలించాల్సిందిగా మంత్రి కేటీఆర్.. డీజీపీ, హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​తోపాటు బల్దియా కమిషనర్​కు ట్విటర్​లో ట్యాగ్​ చేశారు.​ ఇకపై వాహనదారులు ఎంత త్వరగా గమ్యానికి చేరుకోవాలంటే... అంత తక్కువ హారన్​ మోగించాలన్న మాట!

ఇవీ చూడండి:త్వరలో టీస్​బీపాస్​ తీసుకొస్తాం: కేటీఆర్

Last Updated : Jan 31, 2020, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details