తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో వరుసగా పదో రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు - కొవిడ్​ 2020 వార్తలు

ఏపీలో వరుసగా పదో రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు
ఏపీలో వరుసగా పదో రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు

By

Published : Sep 5, 2020, 8:04 PM IST

Updated : Sep 5, 2020, 9:44 PM IST

20:02 September 05

ఏపీలో వరుసగా పదో రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్​లో వరుసగా పదో రోజు 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10,825 కరోనా కేసులు, 71 మరణాలు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 4,87,331కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 4,347 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 11,941 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 3,82,104 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,00,880 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 69,623 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఇప్పటివరకు 40,35,317 కరోనా పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మృతులు...

కరోనాతో నెల్లూరులో 13, అనంతపురంలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో 8, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. విజయనగరంలో 6, ప్రకాశం జిల్లాలో ఐదుగురు మరణించారు. విశాఖలో 5, కృష్ణాలో 4, కడప జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలులో 2, శ్రీకాకుళంలో 2, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.

జిల్లాల్లో కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,399 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 1,332, పశ్చిమగోదావరి జిల్లాలో 1,103, నెల్లూరులో 1,046, కడపలో 1,039, చిత్తూరులో 938, విశాఖలో 765, విజయనగరంలో 642, గుంటూరులో 641, శ్రీకాకుళంలో 601, అనంతపురంలో 549, కర్నూలులో 433, కృష్ణా జిల్లాలో 337 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.  

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

Last Updated : Sep 5, 2020, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details