తెలంగాణ

telangana

ETV Bharat / state

Cannabis Trafficking: మారిన పంథా... గంజాయి ముఠాల కొత్త ఎత్తుగడలు - Ganja gangs news

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా(Cannabis Trafficking)పై నిఘా పెరగడం వల్ల వ్యవస్థీకృత ముఠాలు పంథా మార్చుకుంటున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సరకును గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. దర్యాప్తు బృందాల కంట పడకుండా గమ్యానికి చేరుకునే లారీ డ్రైవర్లకు భారీగా నజరానాలు ప్రకటించటం... ప్రాంతానికో సెల్‌ఫోన్ నంబరు, ప్లేట్‌ వాడటం, సొంత చెక్‌పోస్టుల ఏర్పాటు వంటి అనేక వ్యూహాలు అనుసరిస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

tactics
గంజాయి

By

Published : Nov 27, 2021, 6:27 AM IST

మారిన పంథా... గంజాయి ముఠాల కొత్త ఎత్తుగడలు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని విశాఖ ఏజెన్సీ సీలేరు నుంచి... మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు 1,820 కిలోల గంజాయి(Cannabis Trafficking)ని తరలిస్తున్న ముఠా రాచకొండ ఎస్వోటీ బృందానికి ఇటీవలే చిక్కింది. విచారణలో ముఠా కార్యకలాపాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు... సెల్‌ఫోన్ సిగ్నల్‌ ఆధారంగా పట్టుకునేందుకు అవకాశం ఉండటం వల్ల డ్రైవర్లు సహా ముఠా సభ్యులు ఫోన్‌ నంబర్లను ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు గుర్తించారు. సీలేరులో గంజాయి (Ganja) నింపుకోగానే అప్పటివరకు మాట్లాడిన ఫోన్లు అక్కడే పడేస్తున్నట్లు... విశాఖ వరకు మరొకటి, ఆ తర్వాత హైదరాబాద్‌ శివార్ల వరకు ఇంకో ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

నంబర్ ప్లేట్లు మారుస్తూ...

రవాణాకు వినియోగించే వాహనాల విషయంలోనూ... స్మగ్లర్లు (Cannabis Trafficking) తెలివిగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బంగాల్‌, కర్ణాటక, దిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలనే వాడుతున్నారు. వాటికి నకిలీ నంబర్‌ ప్లేట్లు తగిలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ దాటే వరకు ఆ రాష్ట్రానిది. తెలంగాణలోకి వచ్చాక ఇక్కడిది బిగిస్తున్నారు. తాజాగా 1,820 కిలోలు తరలిస్తూ పట్టుబడిన లారీ పశ్చిమబెంగాల్‌కు చెందినది కాగా... ఆ వాహనానికి ఏపీ నంబర్‌ ప్లేట్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు.

ఏవోబీ నుంచే...

ఈ ముఠాలోని మిగిలిన సభ్యులంతా మహారాష్ట్రకు చెందిన వారే కాగా... డ్రైవర్ రషీదుల్ మాత్రం పశ్చిమబెంగాల్‌ వాసి. ఏవోబీ నుంచి తరచూ గంజాయిని (Cannabis Trafficking) తరలించే అతడికి ముఠాసభ్యులు... భారీ నజరానా ప్రకటించినట్లు దర్యాప్తులో తేలింది. సాధారణంగా ఏవోబీ నుంచే దేశంలోని 14 రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతుంది. ఇందుకుగాను లారీ డ్రైవర్లకు ట్రిప్పు ఒక్కింటికి 50 వేల వరకు ముట్టజెపుతారు. దూరం పెరిగితే మరింత ఎక్కువ ఇస్తున్నారు. అయితే ఉస్మానాబాద్ ట్రిప్పులో మాత్రం రషీద్‌కు గంజాయిని సురక్షితంగా గమ్యానికి చేర్చిన తర్వాత వచ్చిన లాభంలో సమాన వాటా ఇస్తానని ఆశ చూపినట్లు పోలీసుల దర్యాపుల్లో వెల్లడైంది.

ప్రత్యేక చెక్‌పోస్టులు...

రాష్ట్ర పోలీసులు కళ్లుగప్పేందుకు స్మగ్లర్లు సూర్యాపేట, పంతంగి, అబ్దుల్లాపూర్‌మెట్‌లలో మూడు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడున్న తమ సంబంధీకులు అనుమతి ఇస్తేనే వాహనాన్ని ముందుకెళ్లేలా డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా... మరమ్మతుల పేరిట పక్కన నిలిపివేస్తున్నారు. పటాన్‌చెరు దాటితే గంజాయి ముఠాలను పట్టుకోవటం సాధ్యం కాదని ఓ దర్యాప్తు అధికారి తెలిపారు. అక్కడి నుంచి లోడ్‌తో ఉన్న వాహనాలు... అసలు సూత్రదారుల చేతుల్లోకి వెళ్తాయని చెప్పారు. అందుకే నల్గొండ జిల్లా పంతంగి నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు డేగకళ్లతో జల్లెడ పడుతున్నామని వివరించారు.

ఇదీ చూడండి:cryptocurrency loss: క్రిప్టో వ్యాపారం.. తీసింది ప్రాణం

ABOUT THE AUTHOR

...view details