శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు సికింద్రాబాద్ నుంచి కేరళలోని తిరువనంతపురం వరకు ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 29 నుంచి జనవరి 20 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
శబరిమలకు వెళ్లేందుకు ఈ నెల 29 నుంచి ప్రత్యేక రైలు - సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు
శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు రవాణ సౌకర్యాన్ని సులభతరం చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వరకు ప్రత్యేక రైలు నిడిపించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 29 నుంచి జనవరి 20 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
![శబరిమలకు వెళ్లేందుకు ఈ నెల 29 నుంచి ప్రత్యేక రైలు శబరిమలకు వెళ్లేందుకు ఈ నెల 29 నుంచి ప్రత్యేక రైలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9529173-thumbnail-3x2-train.jpg)
శబరిమలకు వెళ్లేందుకు ఈ నెల 29 నుంచి ప్రత్యేక రైలు
మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6:50కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరువనంతపురంలో ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12:20కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.