కొత్త సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త సచివాలయ భవన సముదాయ నమునాపై సమావేశంలో చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్, పొన్ని దృశ్యరూపక ప్రదర్శన ఇవ్వగా.. దాదాపు రెండుగంటలపాటు ఈ అంశంపై చర్చ జరిగింది. వారు రూపొందించిన నమూనాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిమార్పులు, చేర్పులు సూచించారు. వాటి ఆధారంగా రూపొందించిన నమునాకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు కొత్త భవనం నమూనాను... రాష్ట్రం మంత్రివర్గం ఆమోదించింది. నూతన సచివాలయం సత్వరమే నిర్మాణం చేపట్టి ఏడాదిలోపు పూర్తిచేయాలన్న సంకల్పాన్ని తెలియజేసిన కేసీఆర్ నిర్మాణం నిరాంటకంగా సాగుతుందని వివరించారు.
తూర్పు అభిముఖంగా ఏడు అంతస్థుల్లో కొత్త సచివాలయ భవనం - cm kcr
ఏడు అంతస్తులతో కొత్త సచివాలయ భవన నమూనా సిద్దమైంది. హుస్సేన్‌సాగర్ ఎదురుగా.. తూర్పు అభిముఖంగా నూతన భవన సముదాయం రానుంది. ప్రధాన ద్వారంపై ప్రసిద్ధ రాజస్థాన్ దోల్‌పూర్ బీగ్ ఇసుకరాయిని ఉపయోగించనున్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి 400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
హుస్సేన్‌సాగర్ ఎదురుగా తూర్పుకు అభిముఖంగా కొత్త సచివాలయ భవన సముదాయం రానుంది. మొత్తం 7 అంతస్తుల భారీభవనాన్ని నిర్మించనున్నారు. 600 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పుతో భవనం రానుంది. ఏడో అంతస్తులోనే..ముఖ్యమంత్రి కార్యాలయం ఉండనుంది. భవన ప్రధాన ద్వారంపైన ప్రఖ్యాతిగాంచిన రాజస్థాన్ దోల్ పూర్ బీగ్ ఇసుకరాతిని ఉపయోగించనున్నారు. అన్ని కిటికీలకు నీలం రంగు అద్దాలను వినియోగించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఏడో అంతస్తుపైన ప్రత్యేకంగా పెంకుల తరహా నమూనా ఉండనుంది. ప్రధాన ద్వారంపైన తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, ఆ పైన జాతీయ జెండా ఉండేలా రూపొందించారు. భవనం మధ్యలో ఉండే పెద్దడోమ్‌పై జాతీయచిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు. పూర్తిస్థాయి సౌకర్యాలు, ఆధునిక హంగులతో పర్యావరణహితమైన భవనాన్ని నిర్మించనున్నారు. భవనం ముందు పెద్దలాన్స్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్త సచివాలయ భవన నిర్మాణానికి 400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. నమూనా ఆమోదం పొందిన నేపథ్యంలో రహదార్లు, భవనాల శాఖ అంచనాలను ఖరారు చేసి టెండర్లు పిలవనుంది.
ఇవీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకు తెలంగాణ.. ఏపీ కేవియట్ పిటిషన్