తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్ - New Schedule for Voter List

2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్ల వయస్సున్న వారందరూ ఓటు హక్కు కోసం జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటర్ల జాబితా సవరణ

By

Published : Nov 13, 2019, 9:12 PM IST

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. 2020 జనవరి 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఓటర్ల వివరాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు నవంబర్ 30 చివరి తేదీగా పేర్కొంది. ఓటర్ జాబితాపై అభ్యంతరాలు వినతులకు 2020 జనవరి 15 వరకు గడువు ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.

సమస్యల పరిష్కారానికి చివరి తేది 2020 జనవరి 27గా పేర్కొంది. ఓటర్ల జాబితా అనుబంధాల తయారీ గడువు 2020 ఫిబ్రవరి 4న ఉంటుంది. ఓటర్ల తుది జాబితాల ప్రకటన 2020 ఫిబ్రవరి 7న వెల్లడించనున్నట్లు ఈసీ వెల్లడించింది. 2020 జనవరి 1 నాటికి 18ఏళ్ల వయసున్న వారందరూ ఓటు హక్కు కోసం జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఇదీ చూడండి : శబరిమల, రఫేల్​ కేసులపై రేపు సుప్రీం తీర్పు

ABOUT THE AUTHOR

...view details