తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగులకు తీపికబురు.. ఆగస్టులో అందనున్న పెరిగిన వేతనాలు - పీఆర్సీ వేతనాలు అమలు

వేతన సవరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెరిగిన వేతనాలు ఆగస్టు నుంచి అందుకోనున్నారు. గతనెలలోనే అందాల్సి ఉన్నా కూడా ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అది సాధ్యం కాలేదు. అప్పుడు కేవలం పెన్షనర్లకు మాత్రమే పీఆర్సీ ప్రకారం చెల్లించారు.

Salaries
ఉద్యోగులకు తీపికబురు

By

Published : Jul 27, 2021, 10:33 PM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. పీఆర్సీ అనుగుణంగా పెరిగిన వేతనాలను ఆగస్టు నుంచి వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. గత నెలలోనే వారికి పెరిగిన వేతనాలు అందాల్సి ఉన్నప్పటికీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అది వీలు పడలేదు. గతంలో కేవలం పెన్షనర్లకు మాత్రమే పీఆర్సీకి అనుగుణంగా పెన్షన్లు ఇచ్చారు. ఉద్యోగులకు పాత వేతనాలే అందాయి.

జూన్​ వేతనాల్లో అదనపు చెల్లింపులు

అయితే ప్రస్తుతం వేతన సవరణకు సంబంధించిన కసరత్తు పూర్తి కావడంతో జూన్ నెల వేతనానికి సంబంధించి కూడా అదనపు చెల్లింపులు చేస్తున్నారు. దీంతో జూన్ నెల నుంచే పెరిగిన వేతనాలు ఉద్యోగులకు లభించినట్లవుతుంది. ఆగస్టులో తీసుకునే జులై నెల వేతనాలు మాత్రం పీఆర్సీకి అనుగుణంగా పెరిగిన మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు ఇప్పటి వరకు నెలకు మూడు వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యేదని అధికారులు చెబుతున్నారు. కానీ పెరిగిన వేతనాల చెల్లింపులతో ఆగస్టు మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details