హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నూతన ఆర్ఎంఓను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం పని చేస్తున్న జయకృష్ణ స్థానంలో గాంధీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ శేషాద్రిని నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. జయకృష్ణను ఉస్మానియా ఆస్పత్రికి బదిలీ చేశారు.
గాంధీ ఆస్పత్రిలో కొత్త ఆర్ఎంఓ నియామకం - గాంధీ ఆస్పత్రి కొత్త ఆర్ఎమ్ఓ డాక్టర్ శేషాద్రి
గాంధీ ఆస్పత్రిలో నూతన ఆర్ఎంఓను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పని చేస్తున్న జయకృష్ణ స్థానంలో గాంధీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ శేషాద్రిని నియమిస్తున్నట్టు ప్రకటించింది.
గాంధీ ఆస్పత్రిలో కొత్త ఆర్ఎంఓ నియామకం
గాంధీ ఆస్పత్రిలో ఇటీవల రెండు రోజులుగా కారోనా మృతుల శవాలు తారుమారు అవ్వడంపై వైద్య ఆరోగ్య శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తరచూ మృత దేహాలు తారుమారు అవుతుండటం వల్ల గాంధీ ఆస్పత్రి ఇటీవల అపకీర్తిని మూట గట్టుకుంది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీతో సమస్యకు చెక్ పెట్టాలని సర్కారు భావించింది.
ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు