తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2020, 6:33 PM IST

ETV Bharat / state

పార్లమెంట్​ భవనానికి అంబేడ్కర్​ పేరు పెట్టాలి : జాజుల

కేంద్రప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్​, అసెంబ్లీ భవనాలకు అంబేద్కర్​, పూలే పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​ మింట్​ కాంపౌండ్​లోని స్ఫూర్తిభవన్​లో మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి, మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీరావుల వర్ధంతి సభ నిర్వహించారు.

new Parliament building should be named  Ambedkar demand by jajula srinivas goud
పార్లమెంట్​ భవనానికి అంబేడ్కర్​ పేరు పెట్టాలి : జాజుల

మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి, మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీరావుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో స్ఫూర్తిభవన్​లో వర్ధంతి సభను నిర్వహించారు. పేద వర్గాల కోసం పోరాడిన వారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నూతన పార్లమెంట్​, అసెంబ్లీ భవనాలకు అంబేడ్కర్​, పూలే పేర్లు పెట్టాలని డిమాండ్​ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. రిజర్వేషన్లను హరించేందుకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని జాజుల ఆరోపించారు. 2023 నాటికి బీసీలకు రాజకీయ వేదిక ఏర్పాటు కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఓటు మనదే- సీటు మనదే అనే నినాదంతో అధికారమే లక్ష్యంగా పని చేస్తామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ'

ABOUT THE AUTHOR

...view details