హైదరాబాద్లోని రాజ్‌భవన్‌లో భాజపా ప్రతినిధుల బృందం గవర్నర్ నరసింహన్‌ను కలిసి, కొత్త పురపాలక చట్టంపై ఫిర్యాదు చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణలకు పూర్తి విరుద్ధంగా ఈ చట్టాన్ని రూపొందించారని, దీనికి ఆమోదం తెలపవద్దని ఆయనను కోరారు. ఈ చట్టాల ప్రకారం ఎన్నికలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తాయని తెలిపారు. దీనికి విరుద్ధంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ తేదీల ప్రకటన మొదలగు వాటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం అప్రజాస్వామికం, నిరంకుశత్వమని బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆయనతో పాటు డీకే అరుణ, రాజాసింగ్, చింతల రాంచంద్రారెడ్డి, విజయ రామారావు బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొత్త పురపాలక చట్టం రాజ్యాంగ విరుద్ధం: దత్తాత్రేయ - New municipal law is unconstitutional: Dattatreya
అసెంబ్లీ ఆమోదించిన పురపాలక బిల్లుకు వ్యతిరేకంగా భాజపా నేతలు గవర్నర్‌కు మెమరాండం సమర్పించారు. బిల్లులో ఉన్న రాజ్యాంగ వ్యతిరేక అంశాలను పున:పరీశీలించాలని ప్రభుత్వానికి సూచించాల్సిందిగా గవర్నర్ను కోరారు.
కొత్త పురపాలక చట్టం రాజ్యాంగ విరుద్ధం: దత్తాత్రేయ