తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో కొత్తగా 3 వేల మరుగుదొడ్లు: లోకేశ్‌ కుమార్‌ - హైదరాబాద్​ జిల్లా తాజా వార్తలు

భాగ్యనగరంలో కొత్తగా 3వేల ప‌బ్లిక్ టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్‌ కుమార్ తెలిపారు. ఆగ‌స్టు 15లోపు ప్రతి జోన్‌లో 500 చొప్పున మొత్తం 3 వేల మ‌రుగుదొడ్లను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. సికింద్రాబాద్ జోన్‌లో 229 ప్రదేశాల‌ను గుర్తింన‌ట్లు కమిషనర్‌ వివ‌రించారు.

హైదరాబాద్‌లో కొత్తగా 3 వేల మరుగుదొడ్లు: లోకేశ్‌ కుమార్‌
హైదరాబాద్‌లో కొత్తగా 3 వేల మరుగుదొడ్లు: లోకేశ్‌ కుమార్‌

By

Published : Jul 4, 2020, 10:52 PM IST

హైద‌రాబాద్‌లో కొత్తగా 3వేల ప‌బ్లిక్ టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్‌ కుమార్ వెల్లడించారు. న‌గరంలోని ప్రధాన జంక్షన్లు, రోడ్లు, పార్కుల ప్రహ‌రీ గోడ‌ల ప‌క్కన బీవోటీ ప‌ద్ధతిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆగ‌స్టు 15లోపు ప్రతి జోన్‌లో 500 చొప్పున మొత్తం 3 వేల మ‌రుగుదొడ్లను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.

ఇప్పటి వ‌ర‌కు మొత్తం 2,729 ప్రదేశాల‌ను ఎంపిక చేశామ‌ని సికింద్రాబాద్ జోన్‌లో మిగిలిన 271 ప్రదేశాల‌ను త్వర‌లో ఎంపిక చేస్తామ‌ని లోకేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 140 చోట్ల ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి కాగా.. 237 ప్రదేశాల్లో ప‌నులు జ‌ర‌గుతున్నాయన్నారు. ఇప్పటి వ‌ర‌కు ఎల్బీన‌గ‌ర్‌, కూక‌ట్‌ప‌ల్లి, చార్మినార్‌, శేరిలింగంప‌ల్లి, ఖైర‌తాబాద్ జోన్ల‌లో 500 చొప్పున ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అనువైన ప్రదేశాల ఎంపిక పూర్తయింద‌ని తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్ జోన్‌లో 229 ప్రదేశాల‌ను గుర్తింన‌ట్లు కమిషనర్‌ వివ‌రించారు.

ఇదీ చూడండి:బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

ABOUT THE AUTHOR

...view details