హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. నియోజకవర్గంలో గురువారం ఒక్కరోజే దాదాపు 29 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు జీహెచ్‌ఎంసీ వైద్య సిబ్బంది తెలిపారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 29 మందికి కరోనా - కరోనా తాజా వార్తలు
ముషీరాబాద్ నియోజకవర్గంలో రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజల్లో భయం పెరుగుతోంది. గురువారం సుమారు 29 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు జీహెచ్‌ఎంసీ వైద్య సిబ్బంది వెల్లడించారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 29 మందికి కరోనా
కరోనా బారిన పడి గురువారం ముగ్గురు మృతి చెందారు. జులై 2 వరకు మొత్తం 17 మంది మహమ్మారితో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 365 మంది వైరస్ బారిన పడ్డారు. రామ్ నగర్, అడిక్ మెట్, ముషీరాబాద్, బోలక్‌పూర్, గాంధీ నగర్, కవాడిగూడ డివిజన్లలోని అనేక ప్రాంతాల ప్రజలకు వైరస్ నిర్ధరణ అయింది.
ఇది చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ