హైదరాబాద్ జిల్లా అంబర్ పేట నియోజక వర్గ పరిధిలో కరోనా ఉధృతి కొంచెం తగ్గినట్లుగా తగ్గి మళ్లీ పెరుగుతూ వస్తోంది. బుధవారం 23 మందికి వైరస్ నిర్ధరణ అయింది. బుధవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో అధికంగా అంబర్ పేట డివిజన్ పరిధిలో 9, నల్లకుంట8, కాచిగూడ 3, గోల్నాక 2, బాగ్ అంబర్‌పెట డివిజన్ పరిధిలో 1 కేసు నమోదైంది.
అంబర్ పేట నియోజక వర్గంలో 23 మందికి కరోనా - కరోనా తాజా వార్తలు
అంబర్ పేట నియోజక వర్గ పరిధిలో కరోనా తగ్గినట్లే తగ్గి పెరుగుతూ వస్తోంది. బుధవారం ఒక్కరోజే 23 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వీరిలో వృద్ధులతో పాటు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు.
అంబర్ పేట నియోజక వర్గంలో 23 మందికి కరోనా
నల్లకుంట డివిజన్ పరిధిలోని శాంతి భవన్ అపార్ట్‌మెంట్‌లోని ఒకే కుటుంబంలో ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. తిలక్ నగర్‌లో ఇద్దరు యువతులకు (ట్విన్స్)కు మహమ్మారి సోకింది. కాచిగూడ ఆర్టీసీ క్వార్టర్స్‌లో నివాసముండే ఒక ఆర్టీసీ ఉద్యోగికి(58) వైరస్ పాజిటివ్ అని తేలింది. అంబర్‌పేట పరిధిలోని అశోక్ నగర్‌లో ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధులకు, ఒక వ్యక్తికి కరోనా సోకింది.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్