ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 91,594 పరీక్షలు నిర్వహించగా.. 2,672 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19,37,122 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ap corona cases: ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు - ap latest news
ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 19,37,122 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా కేసులు
దీంతో ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,115కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 2,467 మంది బాధితులు కోలుకోవటంతో ఆ రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 18,98,966కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25,041 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,34,88,031 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.