హైదరాబాద్ అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేట పటేల్ నగర్‌కు చెందిన మహిళ (38) కరోనా చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందింది.
అంబర్ పేట నియోజకవర్గంలో 30 కరోనా కేసులు - కరోనా అప్డేట్ వార్తలు
హైదరాబాద్ అంబర్ పేట నియోజకవర్గంలో కరోనా కలవరం కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 30 కేసులు నమోదయ్యాయి. అలాగే చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. అధికంగా నల్లకుంట డివిజన్లో 10 మంది కొవిడ్ బారిన పడ్డారు.
అంబర్ పేట నియోజకవర్గంలో 30 కరోనా కేసులు
మంగళవారం నిర్ధరణ అయిన కొవిడ్ కేసుల్లో అధికంగా నల్లకుంట డివిజన్ పరిధిలో 10 నమోదు కాగా.. అంబర్ పేట 8, బాగ్ అంబర్ పేట 5, గోల్నాక 4, విద్యానగర్‌లో 2, కాచిగూడ డివిజన్ పరిధిలో ఒక కేసు నమోదైంది.
ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలను ఏం చేస్తారంటే..