రాష్ట్రంలో కొత్తగా 1284 కరోనా కేసులు, ఆరుగురు మృతి - తెలంగాణలో కరోనా కేసుల తాజా వార్తలు
22:37 July 18
రాష్ట్రంలో మరో 1284 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేలా లేదు. తాజాగా రాష్ట్రంలో 1284 మందికి కొవిడ్ సోకగా... అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 667 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య.. 43 వేల మార్కు దాటింది.
తాజాగా వచ్చిన పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకు 43,780 మంది కరోనా బారిన పడ్డారు. శనివారం 1,902 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 30,607 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. తాజాగా ఆరుగురు కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 409 మంది మహమ్మారికి బలయ్యారు.
ఇది చదవండి:'రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించకూడదు.. అదే నా లక్ష్యం'