తెలంగాణలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా 1,198 కొవిడ్ కేసులు నమోదు కాగా.. వైరస్‌తో ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో మహమ్మారి బాధితుల సంఖ్య 46,274కు చేరింది. కొవిడ్ బారినపడి ఇప్పటివరకు 422 మంది మరణించారు. వైరస్ నుంచి కోలుకుని 34,323 మంది డిశ్చార్జి కాగా.. 11, 530 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాస్త తగ్గింది.. రాష్ట్రంలో మరో 1,198 కరోనా కేసులు - కరోనా కేసుల తాజా వార్తలు
20:16 July 20
కాస్త తగ్గింది.. రాష్ట్రంలో మరో 1,198 కరోనా కేసులు
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 510 కరోనా కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా భారీగా నమోదవుతుండగా.. ఈరోజు మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య తక్కువగా నమోదైంది.
కరీంనగర్ 87, మేడ్చల్ జిల్లాలో 76 మందికి కరోనా నిర్ధరణ అయింది. అలాగే వరంగల్ అర్బన్ 73, మహబూబ్‌నగర్ జిల్లాలో 50, మహబూబాబాద్, జగిత్యాల జిల్లాల్లో 36 చొప్పున కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 31, నాగర్‌కర్నూల్ జిల్లాలో 27, భూపాలపల్లి జిల్లాలో 26, నల్గొండ జిల్లాలో 24 మంది వైరస్ బారిన పడ్డారు.
మెదక్ జిల్లాలో తాజాగా 13 మందికి మహమ్మారి సోకింది. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో 12 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో 11 చొప్పున.. సంగారెడ్డి జిల్లాలో 10, ములుగు జిల్లాలో 9, పెద్దపల్లి జిల్లాలో 8, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నలుగురికి వైరస్ నిర్ధరణ అయింది. సిద్దిపేట, గద్వాల, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున కేసులు నమోదు కాగా.. యాదాద్రి భువనగిరి, నిర్మల్, వరంగల్ రూరల్ జిల్లాలో ఒక్కో కరోనా కేసు నమోదైంది.
ఇవీ చూడండి:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్