హైదరాబాద్ అంబర్ పేట నియోజక వర్గ పరిధిలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్క రోజే 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాగ్ అంబర్ పేట పరిధిలో 70 ఏళ్ల వృద్ధుడు గాంధీలో వైరస్ చికిత్స పొందుతూ మరణించాడు.
అంబర్ పేట నియోజకవర్గంలో మరో 105 కరోనా కేసులు - అంబర్ పేట నియోజకవర్గంలో మరో 105 కరోనా కేసులు
అంబర్ పేట నియోజకవర్గంలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. తాజాగా 105 వైరస్ పాజిటివ్ కేసులు తేలగా.. 70ఏళ్ల వృద్ధుడు మహమ్మారితో మరణించాడు. ఇప్పటివరకు అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2393కు చేరుకోగా.. మరణాల సంఖ్య 48కి చేరింది.
![అంబర్ పేట నియోజకవర్గంలో మరో 105 కరోనా కేసులు అంబర్ పేట నియోజకవర్గంలో మరో 105 కరోనా కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8131299-396-8131299-1595429718301.jpg)
అంబర్ పేట నియోజకవర్గంలో మరో 105 కరోనా కేసులు
అంబర్ పేట డివిజన్ పరిధిలో 45 కేసులు నమోదు కాగా.. నల్లకుంట 31, కాచిగూడ 22, బాగ్ అంబర్ పేట 02, గోల్నాక పరిధిలో 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2393కు చేరుకోగా.. మరణాల సంఖ్య 48కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 895 గా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
TAGGED:
అంబర్ పేట కరోనా అప్డేట్స్