New MLA Candidates in Telangana Assembly Elections 2023 : రాజకీయం అనేది వైకుంఠపాళి. ఓసారి అందనత్త ఎత్తుకు తీసుకెళ్తుంది. మరోసారి అధఃపాతాళానికి నెట్టేస్తుంది. అయినా సరే గెలుపోటములు పట్టించుకోకుండా చాలా మంది రాజకీయాల్లో తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు వస్తుంటారు. అలా మరికొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ శాసనస సభ ఎన్నికల్లోనూ చాలా మంది తమ రాజకీయ భవిష్యత్ ఏంటో తెలుసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈసారి చాలా మంది కొత్త వాళ్లు ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి 18 మంది కొత్తవారు అవకాశం దక్కించుకుని ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
First Timers in Telangana Assembly Elections 2023 :ఈ మేరకు అభ్యర్థుల్లో చాలామంది తాము టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీలో గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో టికెట్టు రాక అసంతృప్తి ఉండగా .. వారి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థులు బలమైన వారు కావడంతో వారిని ఢీ కొట్టడానికి సర్వశక్తులు కూడగట్టుకుంటున్నారు. ఉదాహరణకు.. పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై పోటీ చేస్తున్న యశస్విని(కాంగ్రెస్) తనను తాను నిరూపించుకోవడానికి నిత్యం ప్రజల్లో తిరుగుతూ శ్రమిస్తున్నారు.
బీజేపీ - జనసేన మధ్య తేలిన సీట్ల లెక్క, తెలంగాణలో 9 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన
New MLA Candidates list For 2023 Elections: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప బలమైన అభ్యర్థిగా ఉండగా.. ఆయనను ఢీ కొట్టడానికి ప్రజల్లో తిరుగుతూ గెలుపొందేందుకు సర్వశక్తులు కూడగట్టుకుంటున్నారు. సిర్పూర్‌లోనే ఉండటానికి నూతన గృహ ప్రవేశం కూడా చేశారు. బీఎస్పీ తరపున కేడర్‌ను పెంచుకోవడంతో పాటు వారి ద్వారా ప్రచారం నిర్వహించి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన కృషి చేస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత మొదటిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. తన తండ్రి చేసిన అభివృద్దిని గమనించి కేసీఆర్ టికెట్టు ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌కు తన గెలుపును గిఫ్ట్ ఇచ్చేందుకు ఆమె తీవ్రంగా కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కంటోన్మెంట్ నుంచే తొలిసారి బరిలోకి దిగారు. రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన వడ్డి మోహన్‌రెడ్డి బోధన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తొలిసారే తాజా, మాజీ ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నారు.
ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్