తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచే కొత్త మద్యం విధానం - new liquor policy in telangana

తెలంగాణలో రేపటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే 2,216 దుకాణాల ఏర్పాటుకు కొత్త లైసెన్స్​లు జారీ ప్రక్రియ పూర్తైంది.

రేపటి నుంచే కొత్త మద్యం విధానం

By

Published : Oct 31, 2019, 7:55 PM IST

Updated : Oct 31, 2019, 11:53 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 90శాతం మందికి లైసెన్స్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండడం వల్ల లైసెన్సీలకు మద్యం సరఫరా చేసే ప్రక్రియ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానుంది. రాత్రి పది గంటల నుంచి తెల్లవార్లు కొనసాగుతుంది. దీనికోసం రాష్ట్రంలోని 19 మద్యం డిపోలు రాత్రంతా పని చేస్తాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోడానికి తగిన వసతి ఉన్న వారంతా రేపటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారని...మిగిలిన వారు...ఒకట్రెండు రోజులు ఆలస్యంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రేపటి నుంచే కొత్త మద్యం విధానం
Last Updated : Oct 31, 2019, 11:53 PM IST

ABOUT THE AUTHOR

...view details