హైదరాబాద్ బయోడైవర్సిటీ జంక్షన్‌లో నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీ ప్యాకేజీ-4 కింద రూ. 379 కోట్ల వ్యయంతో జేఎన్టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12 కిలోమీటర్ల కారిడార్ నిర్మించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటివరకు ఐదు పనులు ప్రారంభమయ్యాయి.
బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ - New_Flyover_Opening by minister ktr at biodiversity junction
హైదరాబాద్ బయోడైవర్సిటీ జంక్షన్‌లో ఫస్ట్‌లెవల్ పైవంతెన నిర్మాణం పూర్తయింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ నుంచి కొంత ఉపశమనం కలగనుంది.
![బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ new-flyover-opening-by-minister-ktr-at-biodiversity-junction](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7283423-thumbnail-3x2-flyover.jpg)
బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు ఉన్న పైవంతెనపై ఒకేవైపు వాహనాలను అనుమతించనున్నారు.
ఇదీ చూడండి:పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు