నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ఎంపికకు ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. 2019 నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2,216 మద్యం దుకాణాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18న లాటరీ పద్ధతి ద్వారా కొత్త లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్నారు.
ఆరు శ్లాబుల్లో లైసెన్స్ రుసుం...
2019 నవంబర్ 1 నుంచి కొత్తగా ఎంపికైన లెసెన్స్ దారులు మద్యం దుకాణాలను నిర్వహిస్తారు. లిక్కర్ మీద 27శాతం... మీడియం, ప్రీమియం రకం మద్యంపై 20శాతం... బీరుపైన 20శాతం లెక్కన ఆయా లైసెన్స్ దారుడు లాభం పొందుతాడు. గతంలో నాలుగు రకాల శ్లాబులు ఉండగా... తాజా విధానంలో 6 శ్లాబులుగా పేర్కొన్నారు. మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుమును రూ.లక్ష నుంచి 2 లక్షలకు ప్రభుత్వం పెంచింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక దృష్ట్యా సూర్యాపేట జిల్లాలో మద్యం దుకాణాల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది.
ఇవీ చూడండి: కొత్త మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం