తెలంగాణ

telangana

సెప్టెంబరు 28, 29 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌

By

Published : Aug 24, 2020, 7:26 AM IST

రెండుసార్లు వాయిదా పడిన రాష్ట్ర ప్రవేశ పరీక్షల కొత్త తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, ఈసెట్‌తో పాటు పాలిసెట్‌ తేదీలను ఈ నెల 10న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. మిగిలిన పరీక్షల తేదీలను మంత్రి ఆమోదంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి శనివారం వెల్లడించారు. ఈసెట్‌ను ఈ నెల 31న నిర్వహిస్తుండగా...ఎడ్‌సెట్‌, లాసెట్‌లను అక్టోబరు మొదటి వారంలో పూర్తి చేయనున్నారు. మిగిలిన అన్ని పరీక్షలు సెప్టెంబరులోనే జరపనున్నారు. వ్యాయామ విద్య పరీక్ష(పీఈసెట్‌) తేదీలను ఖరారు చేయలేదు.

New dates for telangana state entrance exams
సెప్టెంబరు 28, 29 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌

రాత పరీక్షలకు 4.07 లక్షల దరఖాస్తులు

ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగే ఏడు ప్రవేశ పరీక్షలకు మొత్తం 4.07 లక్షల మంది దరఖాస్తు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు రాసే విద్యార్థులే 47,312 మంది ఉన్నారు. వాటిలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 25 వేలకు పైగా, అగ్రికల్చర్‌కు 16 వేలకు పైగా ఉండటం విశేషం. ఇంకా తేదీలు ఖరారు కాని పీఈసెట్‌కు తెలంగాణ నుంచి 6,500 మంది దరఖాస్తు చేశారు. అత్యధికంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1.42 లక్షలు దరఖాస్తులు రాగా...ఆ తర్వాత 78 వేలతో అగ్రికల్చర్‌ నిలిచింది. గత ఏడాది కంటే ఈసెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌, పీఈసెట్‌కు దరఖాస్తులు పెరిగాయి. ఐసెట్‌కు దాదాపు 7 వేల వరకు పెరిగాయని కన్వీనర్‌ రాజిరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షలు మళ్లీ వాయిదా పడతాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details