తెలంగాణ

telangana

ETV Bharat / state

AP Current Charges: ఆగస్టు నుంచి కొత్త విద్యుత్‌ ఛార్జీలు? - new current charges in ap from august

Current charges: ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి.పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ప్రభావితమయ్యే శ్లాబ్‌లపై యూనిట్‌కు 20 పైసల నుంచి రూ.1.40 వరకు భారం పడే అవకాశం ఉంది. ఇవి ఈ సంవత్సరం ఆగస్టు నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

Current charges:
Current charges:

By

Published : Mar 28, 2022, 12:35 PM IST

Current charges: ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఉన్న 13 శ్లాబ్‌లను 6 శ్లాబ్‌లకు కుదించాలని నిర్ణయించాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ప్రభావితమయ్యే శ్లాబ్‌లపై యూనిట్‌కు 20 పైసల నుంచి రూ.1.40 వరకు భారం పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిలో (ఏపీఈఆర్‌సీ) ప్రతిపాదనలను దాఖలు చేశాయి. కొత్త టారిఫ్‌పై ఈ నెల 30న ఏపీఈఆర్‌సీ ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది. ఇవి ఈ సంవత్సరం ఆగస్టు నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఏప్రిల్‌లోనే కొత్త ఛార్జీలను అమలుచేయాలి. కానీ, ట్రూఅప్‌ ఛార్జీలు పెంచాల్సి ఉన్నందున భారం పెరుగుతుందని వాయిదా వేశారు. చివరకు ట్రూఅప్‌ ఛార్జీలూ పెంచలేదు.

రెండు రకాల టారిఫ్‌లకు ప్రతిపాదన:డిస్కంల ప్రతిపాదనను ఏపీఈఆర్‌సీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రకారం 2022 ఏప్రిల్‌ నుంచి జులై వరకు పాత టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ ఛార్జీలను వసూలు డిస్కంలు వసూలు చేయనున్నాయి. ఏ కేటగిరీలో రెండు, బీ కేటగిరీలో నాలుగు, సీ కేటగిరీలో ఏడు శ్లాబుల్లో ఛార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదించాయి. దీని తర్వాత ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు శ్లాబ్‌లను తగ్గించి.. ఫుల్‌కాస్ట్‌ టారిఫ్‌ ప్రకారం ఛార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదించాయి. ఇందులో గృహ వినియోగదారులను ఏ, బీ కేటగిరీలకు కుదించింది. నెల వినియోగం 75 యూనిట్లలోపున్న వారిని ఏ కేటగిరీలో.. అంతకుమించి వినియోగం ఉన్నవారిని బీ కేటగిరీలో ఉంచింది.


ABOUT THE AUTHOR

...view details