ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 1690కి చేరిన కరోనా మరణాలు - telangana corona cases

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా రెక్కలు విప్పుకుంటోంది. మళ్లీ పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. తాజాగా... రాష్ట్రంలో 403 కొత్త కేసులు నమోదవగా... మరో ఇద్దరు కొవిడ్​ బారిన పడి మరణించారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 3,06,742కి చేరింది.

new corona cases,  telangana
రాష్ట్రంలో 1690కి చేరిన కరోనా మరణాలు
author img

By

Published : Mar 29, 2021, 9:30 AM IST

రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా క్రియాశీల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 4,583కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 403 మంది మహమ్మారి భారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 3,06,742కి చేరింది. తాజాగా 313 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 3,00,469‬ మంది కోలుకున్నారు.

మరో ఇద్దరిని మహమ్మారి బలితీసుకోగా... మొత్తం కరోనా మరణాలు 1690కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,583 మంది యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,815 మంది ఐసోలేషన్​లో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 146 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 33,930 మందికి కరోనా పరీక్షలు చేశారు.

ఇక కరోనా బారిన పడుతున్న వారిలో సుమారు 47 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావటం గమనార్హం. మహమ్మారి సోకిన వారిలో ఇటీవల చాలా స్వల్పంగానే లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం కరోనా సిప్టమ్స్ ఉన్నా.. తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని విన్నవిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details