తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ బాధితుల కోసం విశాఖ కేజీహెచ్​లో కొత్త బ్లాక్ - విశాఖలో కేజీహెచ్​లో కొత్త బ్లాక్ న్యూస్

విశాఖ కేజీహెచ్​లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు కొత్త బ్లాక్ సిద్ధం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ సామాజిక బాధ్యత కింద ఈ బ్లాక్ ను నిర్మించాయి. రూ.46 కోట్లతో నిర్మించిన ఈ బ్లాక్ ను ఇప్పుడు కొవిడ్ రోగుల కోసం సిద్ధం చేస్తున్నారు.

కొవిడ్ బాధితుల కోసం విశాఖ కేజీహెచ్​లో కొత్త బ్లాక్
కొవిడ్ బాధితుల కోసం విశాఖ కేజీహెచ్​లో కొత్త బ్లాక్

By

Published : Jul 29, 2020, 3:29 PM IST

ఏపీ విశాఖలో కొవిడ్ కేసుల చికిత్స కోసం కేజీహెచ్​లో కొత్త బ్లాక్ సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ సామాజిక బాధ్యత కింద ఈ బ్లాక్ ను నిర్మించాయి. రూ. 46 కోట్లతో ఈ ఐదంతస్థుల భవనాన్ని ఎకరం స్థలంలో నిర్మించారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్ గెయిల్, బెల్, ఓఎన్జీసీ, హెచ్​పీసీఎల్, ఎన్​టీపీసీ, ఎన్​పీపీఐఎల్ సంస్థలు తమ సామాజిక బాధ్యత కింద నిధులను కొవిడ్ బ్లాక్ నిర్మాణం కోసం అందించాయి. 2016లో బ్లాక్ నిర్మాణం ప్రారంభం అయినప్పటికీ కొంత నిధులను దశల వారీగా విడుదలకు.. ఆయా సంస్థలు చర్యలు చేపట్టడంలో జాప్యం అనివార్యమైంది. సర్జికల్ అంకాలజీ భాగంగా దీనిని తీర్చిదిద్దేందుకు నిర్దేశించారు.

విశాఖ జిల్లాలో కొవిడ్ వ్యాప్తి విస్తృతమైనందున.. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు మొత్తం 500 బెడ్​లను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని బెడ్​లకు ఆక్సిజన్ సరఫరా.. 100 బెడ్లకు వెంటిలేటర్ సదుపాయం, మానిటరింగ్​కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 281 మంది నర్సింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈ బ్లాక్​ను లాంఛనంగా ప్రారంభించి కొవిడ్ రోగుల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ ఆసుపత్రి బ్లాక్ అందుబాటులోకి వస్తే.. విశాఖ నగరంలో మరో ప్రధాన విభాగం తెరపైకి వచ్చినట్లే.

ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details