హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం రిలీవ్ కానున్నట్లు సమాచారం. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. కొద్దికాలంగా ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమవనున్న నేపథ్యంలో శ్వేతామహంతి విదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు చేశారు.
త్వరలో హైదరాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్! - కలెక్టర్ల నియామకం
హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమవనున్నన నేపథ్యంలో ఆమె అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు కొత్త కలెక్టర్‌ను నియమించనున్నట్లు సమాచారం.

హైదరాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్!
ఈ నెల 12వ తేదీన అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దినెలలుగా మేడ్చల్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు జిల్లాలకు రెండు మూడ్రోజుల్లో కొత్త కలెక్టర్లను నియమించవచ్చని సమాచారం.
ఇదీ చూడండి:మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధ్యమే: తమన్నా