భారతీయ కళాకారులకు ఆధునిక హంగులతో కూడిన వస్త్ర దుకాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు నాగయ్య తెలిపారు. హైదరాబాద్లోని దోమలగూడలో నాటక కళాకారుల వస్త్ర దుకాణాన్ని బ్రాహ్మణ సంక్షేమ సంఘం పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచారి ప్రారంభించారు. ప్రముఖ గురువు శోభానాయుడు వద్ద పనిచేసిన నాగయ్య షోరూం ఏర్పాటు చేయడం సంతోషకర విషయమన్నారు.
నాటకరంగానికి పూర్వవైభవం తీసుకురావాలి : కేవీ రమణాచారి - హైదరాబాద్ తాజా సమాచారం
హైదరాబాద్లోని దోమలగూడలో ఏర్పాటు చేసిన నాటక కళాకారుల వస్త్ర దుకాణాన్ని బ్రాహ్మణ సంక్షేమసంఘం పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచారి ప్రారంభించారు. కరోనాతో కుదేలైన నాటక రంగానికి పూర్వవైభవం తీసుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.
నాటకరంగానికి పూర్వవైభవం తీసుకురావాలి : కేవీ రమణాచారి
కళాకారులకు ప్రదర్శన ఎంత ముఖ్యమో వస్త్రాలంకరణ అంతే ప్రధానమని రమణాచారి తెలిపారు. భావితరాలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓలేటి పార్వతీశం, కళాపత్రిక సంపాదకులు మహమ్మద్ రఫీ, ప్రజా గాయని సుద్దాల భారతి, సుజాత మూర్తి పాల్గొన్నారు.