భారతీయ జనతా పార్జీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేతుల మీదుగా... ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నూతన కమిటీకి ఎన్నికైన రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, వివిధ మోర్చాల అధ్యక్షులు నియామక పత్రాలను అందుకున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కె.శ్రీధర్ రెడ్డి, పార్టీ కార్యాలయం కార్యదర్శిగా డాక్టర్ ఉమా శంకర్ బాధ్యతలు స్వీకరించారు.
భాజపా నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేత - new bjp committee in telangana state
భాజపా నూతన రాష్ట్ర నూతన కమిటీకి ఎన్నికైనవారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నారు. కమిటీని ఇటీవల ప్రకటించగా ఇవాళ నియామక పత్రాలు ఇచ్చారు.
![భాజపా నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేత new bjp committee received appointment letter by bandi sanjay in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8413088-1095-8413088-1597386167978.jpg)
భాజపా నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేత
ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమ కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ... రూపొందించిన పుస్తకాన్ని మైనారిటీ మోర్ఛా నాయకులతో కలిసి బండి సంజయ్ విడుదల చేశారు.