తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులను బానిసలుగా మార్చేందుకే చట్టాలు' - సీపీఐ, ఏఐటీయూసీ నాయకుల నిరసన

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ప్రతిఘటన తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్​ చంద్రబోస్​ కేంద్రాన్ని హెచ్చరించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో భోగి మంటల్లో చట్టాల ప్రతులను దగ్ధం చేశారు.

aituc cpi
'రైతులను బానిసలుగా మార్చేందుకే చట్టాలు'

By

Published : Jan 13, 2021, 9:06 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులను బానిసలుగా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్​ చంద్రబోస్ ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని సత్యనారాయణ భవన్​ ఎదుట చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేశారు.

వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. భాజపా పాలనలో అన్ని వివాదాస్పద చట్టాలే వచ్చాయని ఆరోపించారు. అభివృద్ధి, సమన్యాయం, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. పంటకు కనీస మద్దతు ధర ఇవ్వలేని ప్రభుత్వం రైతులకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతుల జీవనోపాధిని నాశనం చేసే నూతన వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బోస్ తెలిపారు.

ఇదీ చూడండి :వ్యవసాయ బావిలో చిరుత.. బయటికి తీసేందుకు విశ్వప్రయత్నం

ABOUT THE AUTHOR

...view details