నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సందర్శించారు. జూ ఒడిలో ఊపిరిపోసుకుని ఆరోగ్యంగా ఒదిగిన ఆఫ్రికన్ జాతి సింహం కూనలను సందర్శకులు తిలకించే వీలుగా ప్రదర్శనకు పచ్చజెండా ఊపి విడుదల చేశారు. అనంతరం జూలో డక్ పాండ్‌తో పాటు కొంగల కొలనులో వాక్ వేను ప్రారంభించారు. మంత్రి వెంట అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ శాఖ ఉన్నతాధికారి పీకె.ఝూ, ఛీప్ వైల్డ్ వార్డెన్ మునిద్ర, జూ పార్క్‌ల డైరెక్టర్ డా.సిదానందకుక్రేటి, క్యూరేటర్ యన్.క్షితిజ తదితరులు పాల్గొన్నారు.
జూపార్క్‌కు ఆఫ్రికన్ జాతి సింహం కూనలు
నగంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కొత్త అందాలు సంతరించుకున్నది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆఫ్రికన్ జాతి సింహం కూనలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. ఇవాళ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీటి ప్రదర్శనకు పచ్చజెండా ఊపి విడుదల చేశారు.
జూపార్క్‌కు ఆఫ్రికన్ జాతి సింహం కూనలు