తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలో ఆధార్​ సేవా తొలి కేంద్రం ప్రారంభం... - NEW ADHAAR HELP CENTER STARTED IN HYDERABAD

నగర ప్రజలకు యూఐడీఏఐ సేవా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్​ మాదాపూర్​లో ఈ కొత్త ఆధార్​ సేవాకేంద్రం ప్రారంభమైంది. రోజూ సుమారు వెయ్యికిపైగా కార్డులను నమోదు చేసేందుకు సౌకర్యాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

NEW  ADHAAR HELP CENTER STARTED IN HYDERABAD
NEW ADHAAR HELP CENTER STARTED IN HYDERABAD

By

Published : Nov 28, 2019, 4:32 AM IST

Updated : Nov 28, 2019, 7:45 AM IST

హైదరాబాద్‌ మాదాపూర్‌ ప్రాంతంలో మొట్టమొద‌టిసారిగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)... తమ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. మాదాపూర్‌ రిలయన్స్ సైబర్ విల్లాలో ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేసినట్లు యూఐడీఏఐ తెలంగాణ రాష్ట్ర సహాయ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ దీపు తెలిపారు.

స్వయంగా యూఐడీఏఐ నిర్వహిస్తున్న ఈ సంస్థలో రోజూ వెయ్యి ఆధార్‌ కార్డుల నమోదుకు వీలుగా సౌకర్యాలు ఉన్నాయన్నారు. కొత్త ఆధార్ న‌మోదుతో పాటు మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చని వివరించారు. పేరు, చిరునామా, పుట్టిన తేది, జెండ‌ర్‌, మొబైల్ నెంబ‌ర్‌, ఈ-మెయిల్ తదితర వివరాలు మార్చుకోవచ్చని స్పష్టం చేశారు. బ‌యోమెట్రిక్స్ సంబంధించి ఫోటో, వేలి ముద్రలు, క‌నుపాపలు అప్‌డేట్‌ కూడా చేసుకోవ‌చ్చని దీపు తెలిపారు.

నగరంలో ఆధార్​ సేవా తొలి కేంద్రం ప్రారంభం...

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు

Last Updated : Nov 28, 2019, 7:45 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details