తెలంగాణ

telangana

ETV Bharat / state

రుణ యాప్‌ సంస్థలపై విచారణలో వెలుగులోకి కొత్త ఖాతాలు

యాప్‌ల ద్వారా రుణాలిచ్చిన నిర్వాహకులను అరెస్టు చేసినప్పటి నుంచి పోలీసు విచారణలో కొత్త ఖాతాల వివరాలు బయటకు వస్తున్నాయి. రుణాలిస్తామంటూ ప్రచారం నిర్వహించి వాటికి అధిక వడ్డీ వసూలు చేస్తున్న చైనా కంపెనీల లావాదేవీలు వేల కోట్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.

యాప్‌ రుణ సంస్థలపై వెలుగులోకి కొత్త ఖాతాలు
యాప్‌ రుణ సంస్థలపై వెలుగులోకి కొత్త ఖాతాలు

By

Published : Feb 16, 2021, 7:37 AM IST

సులువుగా రుణాలిస్తామంటూ ప్రచారం నిర్వహించి వాటికి అధిక వడ్డీ వసూలు చేస్తున్న చైనా కంపెనీల లావాదేవీలు రూ.28 వేల కోట్లకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. యాప్‌ల ద్వారా రుణాలిచ్చిన నిర్వాహకులను అరెస్టు చేసినప్పటి నుంచి పోలీసు విచారణలో కొత్త ఖాతాల వివరాలు బయటకు వస్తున్నాయి.

వీటి ద్వారా నెల రోజుల్లోనే రూ.3 వేల కోట్ల లావాదేవీలను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. వీటిలో రేజర్‌పే ద్వారా 90 శాతం, పేటీఎం, ఇతర ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా మరో 10 శాతం లావాదేవీలు జరిగాయని సంయుక్త పోలీసు కమిషనర్‌ (నేర పరిశోధన) అవినాశ్‌ మహంతి తెలిపారు.

ఇంకో యాప్‌లో తీసుకో..

చైనా కంపెనీలు అప్పు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ప్రలోభపెట్టి గంటల వ్యవధిలో రుణాలిస్తున్నాయి. కొన్ని రోజులయ్యాక అప్పు తిరిగి కట్టేందుకు డబ్బులు లేకుంటే మరో యాప్‌ ద్వారా రుణం తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి ఇలా నలభై నుంచి యాభై యాప్‌ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నాయి.

రుణ గ్రహీతకు ఇక అప్పు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాక వేధింపులు మొదలు పెడుతున్నాయి. రాజేంద్రనగర్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు 30 యాప్‌ల ద్వారా రుణాలిచ్చారు. తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు యాప్‌ కంపెనీల కరెంటు ఖాతాలున్న బ్యాంకుల నుంచి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:వెంచర్ కోసం డబ్బులిచ్చారు... మోసపోయామని ట్యాంక్ ఎక్కారు..

ABOUT THE AUTHOR

...view details