రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా కేసులు, 51మరణాలు - తెలంగాణ తాజా కరోనా కేసులు
![రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా కేసులు, 51మరణాలు coronavirus update, coronavirus update Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11645585-269-11645585-1620187743727.jpg)
09:17 May 05
రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా కేసులు, 51మరణాలు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,361 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో 51 మంది మరణించారు. వైరస్ నుంచి కోలుకుని 8,126 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం 77,704 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న 77,435 పరీక్షలు నిర్వహించగా...జీహెచ్ఎంసీ పరిధిలో 1,225 కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి:తెలుగురాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం డబుల్ మ్యూటెంట్ వైరసే