ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజు వ్యవధిలో 585 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ నిర్ధరించింది. 24 గంటల వ్యవధిలో 35వేల 66మందిని పరీక్షించగా....అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 128మంది కరోనా బారినపడ్డారు. గుంటూరు జిల్లాలో 99, విశాఖ జిల్లాలో 81, కృష్ణా జిల్లాలో 63 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 585 మందికి పాజిటివ్
ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 585 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. కొవిడ్ కారణంగా నలుగురు మృతి చెందారు. దీంతో వైరస్‌తో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,193కి చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 585 మందికి పాజిటివ్
తూర్పుగోదావరి జిల్లాలో మరో 42 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కరోనా కారణంగా చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున 24 గంటల్లో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 251మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 8లక్షల 95వేల 121మంది కరోనా బారిన పడ్డారు.
- ఇదీ చూడండి: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి
Last Updated : Mar 24, 2021, 5:30 PM IST