తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు, 11 మరణాలు - కరోనా తాజా వార్తలు
![తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు, 11 మరణాలు corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12156219-747-12156219-1623848831981.jpg)
18:16 June 16
coroana breaking
రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం సాయంత్రం వరకు లక్షా 16 వేల 252 పరీక్షలు చేయగా 1,489 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వాటితో కలిపి మెుత్తం కేసుల సంఖ్య 6 లక్షల 7 వేల 925కి చేరిందని వివరించింది. వైరస్ దాటికి మరో 11 మంది మృతిచెందగా... మరణాల సంఖ్య 3 వేల 521కి పెరిగింది.
మహమ్మారి బారి నుంచి మరో 1,436 మంది కోలుకోగా 5 లక్షల 84 వేల 249 మంది వైరస్‌ను జయించారని పేర్కొంది. జీహెచ్ఎంసీ (Ghmc) పరిధిలో 175 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. నల్గొండ జిల్లాలో 131, ఖమ్మం జిల్లాలో 118 మందికి పాజిటివ్ తేలింది.
ఇదీ చదవండి:KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం