రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,486 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 42 వేల 299 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,486 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు తెలిపింది. కాగా.. మరో 923 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు, 7 మరణాలు - తెలంగాణ కరోనా కేసులు 2020
09:14 October 20
రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు, 7 మరణాలు
తాజాగా వైరస్ బారిన పడినవారు సహా ఇప్పటి వరకు తెలంగాణలో 2 లక్షల 24 వేల 545 మందికి మహమ్మారి సోకినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరో 1, 891మంది కోలుకోగా మొత్తం 2 లక్షల 2 వేల 577మంది ఇప్పటి వరకు వైరస్ నుంచి బయటపడ్డారు. తాజాగా ఏడుగురు కరోనాతో మృతి చెందగా రాష్ట్రంలో మొత్తం మరణాలు 1282కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 20, 686 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 17, 208మంది ఐసోలేషన్లో ఉన్నారు. కోలుకుంటున్న వారిలో సైతం దాదాపు 70 శాతానికి పైగా కేవలం ఐసోలేషన్లో ఉండి మహమ్మారి నుంచి బయటపడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక తాజాగా వైరస్ బారిన పడినవారిలో జిల్లాల వారీగా చూస్తే.. జీహెచ్ఎంసీ 235, ఆదిలాబాద్ 21, భద్రాద్రి కొత్తగూడెం 98, జగిత్యాల 29, జనగామ 17, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులాబం గద్వాల 20, కామారెడ్డి 38, కరీంనగర్ 69, ఖమ్మం 89, కొమురంభీం ఆసిఫాబాద్ 9, మహబూబ్ నగర్ 30, మహబూబాబాద్ 28, మంచిర్యాల 24, మెదక్ 22, మల్కాజిగిరి 102, ములుగు 23, నాగర్ కర్నూల్ 31, నల్గొండ 82, నారాయణ పేట 8, నిర్మల్ 14, నిజామాబాద్ 28, పెద్దపల్లి 35, సిరిసిల్ల 35, రంగారెడ్డి 112, సంగారెడ్డి 21, సూర్యాపేట 44, సిద్దిపేట 42, వికారాబాద్ 18, వనపర్తి 32, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 54, యాదాద్రి భువనగిరి 29 చొప్పున నమోదయ్యాయి.
ఇదీ చదవండి:కొవిడ్-19పై పోరులో భారత్ కృషి కీలకం: బిల్ గేట్స్