రాష్ట్రంలో కొత్తగా 1,421 కరోనా కేసులు, 6 మరణాలు - Details of corona cases
08:28 October 23
రాష్ట్రంలో కొత్తగా 1,421 కరోనా కేసులు, 6 మరణాలు
రాష్ట్రంలో మరో 1,421 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,001కు చేరింది. ఇప్పటివరకు 1,298 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 1,221 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు2,07,326 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం 20,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 17,214మంది బాధితులు హోం ఐసొలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 249 కరోనా కేసులు, మేడ్చల్ జిల్లాలో 111, రంగారెడ్డి జిల్లాలో 97 కరోనా కేసులు నమోదయ్యాయి.