కోకాపేటలోని భూములను వేలం వేయడానికి ప్రభుత్వం ఏడాది కిందట నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 49.92 ఎకరాలను అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంచర్‌గా మార్చే పనిని హెచ్‌ఎండీఏ భుజానికెత్తుకుంది. ఈ మొత్తం భూమిని ఎనిమిది ప్లాట్లుగా విభజించింది. ఒక్కో ఎకరం కనీసం ధర రూ.25 కోట్లుగా నిర్ధారించింది. తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా సర్కారుకు రూ.2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బాహ్యవలయ రహదారి నుంచి ఈ వెంచర్‌లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మాణాన్ని కూడా అధికారులు మొదలుపెట్టారు. దీనికి అనుగుణంగా ఈ-వేలం వేయడానికి కూడా ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు నియోపొలిస్ (Neopolis Kokapet Venchar)పేరు పెట్టింది.
అవుటర్ పక్కనే ఈ వెంచర్ ఉంది. ప్రస్తుతం ఈ వెంచర్‌లోకి అవుటర్ నుంచి నేరుగా రావడానికి వీలులేదు. ఫైనాన్షియల్ జిల్లా నుంచి కోకాపేటకు రావాలంటే ఇంటర్ ఛేంజ్‌లో ట్రాఫిక్ సమస్య (Traffic Issues)లు ఏర్పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ (Trumpet) నిర్మిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు వైపు నుంచి అవుటర్ మీదుగా నేరుగా నియోపోలిస్ లేఅవుట్ (Neopolis Kokapet Venchar)లోకి రావచ్ఛు దీనికి రూ.82 కోట్లను వ్యయం చేస్తున్నారు. దీంతో ఈ నియోపోలిస్‌కు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఎకరా రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.