తెలంగాణ

telangana

By

Published : Jan 31, 2023, 10:29 PM IST

ETV Bharat / state

'56 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారబోతున్నారు'

Nellore TDP Leader Abdul Aziz Comments: ఏపీలో 56 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోనూ మరో నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీని వీడుతారని చెప్పారు. అధికార పార్టీని వీడేందుకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ప్రయత్నించడం ఏపీ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు.

Abdul Aziz
Abdul Aziz

Nellore TDP Leader Abdul Aziz Comments: ఆంధ్రప్రదేశ్​లో 56 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోనూ మరో నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీని వీడుతారని ఆయన తెలిపారు. ఏపీలో రాజకీయాలు సడెన్​గా మారిపోయాయని, పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నవారు జగన్​ను వదిలి వచ్చేస్తున్నారని నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో అజీజ్ చెప్పారు.

అధికార పార్టీని వీడేందుకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ప్రయత్నించడం ఏపీ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభ సూచికమన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ విధానాలపై గళమెత్తారన్నారు. సొంతపార్టీ నేతలపైనే ఫోన్ ట్యాపింగ్ పెట్టారంటే, ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎప్పుటినుంచో ట్యాపింగ్ చేస్తుంటారని అనుమానం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఏది చెప్తే అది చేసే పోలీసులు, ఇప్పుడు వారిని వారే రక్షించుకోలేక పోతున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్నది చంద్రబాబు, లోకేశ్ నిర్ణయిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వస్తారనే విషయం ఇంకా మా దృష్టికి ఇంకా రాలేదన్నారు. ఊహాగానాల గురించి తాను మాట్లాడనని, శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వస్తే, పార్టీ నిర్ణయాన్ని బట్టి స్పందిస్తానన్నారు.

"175 కు 175 అని జగన్ రెడ్డి చెప్పారు. కానీ ప్రస్తుతం వాళ్లకి ఆ లాస్ట్ డిజిట్ మాత్రమే మిగిలే విధంగా ఉంది. కాబట్టి మొన్నటి వరకూ రెచ్చిపోయిన.. వైసీపీ మంత్రుల, ఎమ్మెల్యేల, కార్యకర్తల రెక్కలు పోతాయని గుర్తుపెట్టుకోండి". - అబ్దుల్‌ అజీజ్‌, టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు

'56 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారబోతున్నారు'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details