తెలంగాణ

telangana

ETV Bharat / state

నాకు ఆడియో కాల్స్​ వస్తే.. సజ్జలకు వీడియో కాల్స్​ వస్తాయి: కోటంరెడ్డి - Nellore District news

Nellore ycp MLA Kotam reddy updates: ఏపీలోని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ అధిష్ఠానం కక్ష సాధింపు చర్యలను ప్రారంభించింది. కోటంరెడ్డికి భద్రతను కుదింపు చేస్తూ నేడు ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా కోటంరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేసినందుకే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని స్థానికులు, పలు పార్టీల కార్యకర్తలు తెగ చర్చించుకుంటున్నారు.

nellore rural mla sridar reddy
నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి

By

Published : Feb 4, 2023, 10:36 PM IST

Nellore ycp MLA Kotam reddy updates: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ అధిష్ఠానం కక్ష సాధింపు చర్యలను ప్రారంభించింది. కోటంరెడ్డికి భద్రతను కుదింపు చేస్తూ.. నేడు ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా కోటంరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేసినందుకే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని స్థానికులు, పలు పార్టీల కార్యకర్తలు తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు కోటంరెడ్డికి 2+2 గన్‌మెన్లు ఉండగా.. 1+1కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన పత్రంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంతకం చేశారు. అనంతరం ఇన్నాళ్లపాటు తనకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తించిన ఇద్దరు సిబ్బందికి ఆయన వీడ్కోలు పలికారు. ఇటీవల వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కూడా పోలీసులు భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పార్టీ వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే భద్రత కుదించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సొంత పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదన్న కారణంతో పార్టీ నుంచి దూరంగా జరగాలని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు.

అయితే, పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు. అంతేకాకుండా వైసీపీ నేతలు తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించిన కోటంరెడ్డి.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెడతానని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన భద్రతను కూడా పోలీసులు కుదించడం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తాజాగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''గుర్తుపెట్టుకో సజ్జల నాకు ఆడియో ​కాల్స్​ వస్తే నెల్లూరు నుంచి మీకు వీడియో కాల్స్ వస్తాయి. బెదిరింపు కాల్స్​ ఎన్ని వచ్చినా భయపడేదేలేదు. రికార్డు చేస్తున్నారని తెలిసినా మాట్లాడాను. నేను భయపడను. నన్ను, నా తమ్ముడిని కొట్టేసుకుంటూ తీసుకెళ్తారా.. రండి చూద్దాం. సజ్జల కోటరీ నుంచి బెదిరింపు కాల్‌ మాట్లాడినట్లు తెలిసింది. అనిల్‌తో మాట్లాడించిన సజ్జలకు చెబుతున్నా బాగా వినండి. నీ మాటలకు వణికేవాళ్లం కాదు. నెల్లూరు రూరల్‌ నుంచి నేరుగా వీడియో కాల్స్‌ వస్తాయి ఇది గుర్తుంచుకోండి. అవసరమైతే హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోండి.'' అని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత కుదింపు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details