పార్కు నిర్వహకుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు హైదరాబాద్ నగర శివారు బండ్లగూడలో విషాదం చోటుచేసుకుంది. పీబీఈఎల్ గేటెడ్ కమ్యూనిటీలో పిల్లలు పార్కులో ఆడుకుంటుండగా, విద్యుదాఘాతంతో ఓ ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పార్కులో మౌనీష్ అలంకరణ స్తంభాన్ని పట్టుకున్నాడు. స్తంభానికున్న విద్యుత్ తీగలు తగలి అక్కడికక్కడే మరణించాడు.
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుని కుటుంబం చెన్నైకి చెందిన వారు కావడంతో మృతదేహాన్ని ఉదయం స్వస్థలానికి తరలించారు. పార్కు నిర్వహకుల నిర్లక్ష్యంతోనే మౌనీష్ చనిపోయాడని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన నిర్వహించారు.