తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.18వేలు కనీస వేతనం కావాలి - PENDING BILLS

వారివి చాలీ చాలని వేతనాలు. కుటుంబ పోషణకు ఆ జీతమే ఆసరా. ఈ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించాలంటూ మొరపెట్టుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అంగన్​వాడీలు మహా ధర్నా నిర్వహించారు.

కనీస వేతనం రూ.18000 నిర్ణయించాలి : ఎస్.రమ

By

Published : Mar 18, 2019, 10:31 PM IST

మా సమస్యలు పరిష్కరించాలి : ఎస్.రమ
ప్రభుత్వం తమకు ఉపాధి భద్రత కల్పించకుండా, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు కుట్రచేస్తోందని ఆరోపిస్తూ అంగన్ వాడీలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఇందిరాపార్కులో మహా ధర్నా నిర్వహించారు. గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నా...వేతనాలు పెంచలేదని సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.రమ ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా పెండింగ్​లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించి కనీస వేతనం రూ.18వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యవసరాల ధరలకు అనుగుణంగా అదనంగా బడ్జెట్ కేటాయించి తమకు బిల్లులుపెంచాలని లేకుంటే పోరాటం తప్పదని అంగన్ వాడీలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details