హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్.. ఇక నుంచి పీవీ నరసింహారావు మార్గ్‌గా మారనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం మేరకు నెక్లెస్ రోడ్లో.. పీవీ నరసింహారావు మార్గ్ పేరిట అధికారులు నూతన బోర్డులను ఏర్పాటు చేశారు.
నెక్లెస్ రోడ్ పేరు మార్పు.. 'పీవీ మార్గ్' బోర్డుల ఏర్పాటు - పీవీ నర్సింహారావు మార్గ్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్‌కు ‘పీవీ నర్సింహారావు మార్గ్’గా నామకరణం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా అధికారులు.. నెక్లెస్ రోడ్ పేరును ‘పీవీ నర్సింహారావు మార్గ్’గా మార్చారు. ఆ మేరకు ఆయా మార్గాల్లో.. నూతన బోర్డులను ఏర్పాటు చేశారు.
Necklace_Road_Name_Change_
1998 మే 28వ తేదీన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెక్లెస్‌రోడ్‌ను ప్రారంభించారు. 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ మార్గం.. పీవీ నరసింహారావు మార్గ్‌గా మారుతుండటం విశేషం.
ఇదీ చదవండి:Hero Nikhil: హీరో నిఖిల్ కారుకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు